మరో చిన్ని గుండెకు ప్రాణం పోసిన మహేష్.!

మరో చిన్ని గుండెకు ప్రాణం పోసిన మహేష్.!

Published on Dec 24, 2020 8:03 AM IST

mahesh babu

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ రీల్ హీరో అయితే ఆఫ్ స్క్రీన్ లో రియల్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన సంపాదనలో ఇప్పటికే చాలా మేర సొసైటీకి ఖర్చు చేసారు. అలా ఇప్పటికే ఎన్నో వేలాది చిట్టి గుండెలకు ఊపిరి పోసిన మహేష్ బాబు నేడు క్రిస్మస్ పండుగకు మరో చిన్ని గుండెకు ఊపిరి పోసి వారి తల్లిదండ్రులకు పండుగ కానుకలా అందించారు.

ఏపీలోని ఉమా కుటుంబానికి చెందిన బిడ్డకు సర్జరీ చికిత్స చేయడం ద్వారా ఆ బిడ్డ బతకడంతో మహేష్ భార్య నమ్రత సోషల్ మిడిల్ ద్వారా దీనిని షేర్ చేసుకొని తన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్ర ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా బాగుండాలని ఆకాంక్షించారు. ఒకపక్క అభిమానుల కోసం సినిమాలు సమాజం కోసం ఇలా సహాయం చేస్తూ మహేష్ రియల్ మహర్షిగా నిలిచారు అని చెప్పాలి.

https://www.instagram.com/p/CJKcDZUDWoz/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు