థలపతి విజయ్ నుంచి రెండు అప్డేట్స్ వస్తాయా.?

థలపతి విజయ్ నుంచి రెండు అప్డేట్స్ వస్తాయా.?

Published on Dec 25, 2020 9:09 AM IST

Vijay 1

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు తమిళ్ లో ఎలాంటి ఓపెనింగ్స్ దక్కుతాయో అందరికీ తెలిసిందే. అలాగే ఒక్క బాక్సాఫీస్ దగ్గరే కాకుండా సోషల్ మీడియాలో కూడా విజయ్ దుమ్ము లేపుతాడు. అయితే ఇప్పుడు విజయ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “మాస్టర్” తెలుగు మరియు తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదలకు రెడీ అవుతుంది.

అయితే మరి ఈ వచ్చే కొత్త సంవత్సరం కానుకగా విజయ్ ఫ్యాన్స్ మంచి ట్రీటే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని ర్రోజుల కితమే మాస్టర్ సెన్సేషనల్ ట్రైలర్ విడుదల అవుతుందని టాక్ రాగా ఇప్పుడు విజయ్ నటించే 65వ సినిమా తాలూకా టైటిల్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మాస్టర్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా నటించగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు