తలైవర్ రజినీకాంత్ కు ఉన్నట్టుండి క్షీణించిన ఆరోగ్యం.!

తలైవర్ రజినీకాంత్ కు ఉన్నట్టుండి క్షీణించిన ఆరోగ్యం.!

Published on Dec 25, 2020 1:41 PM IST

Rajinikanth 1

తలైవర్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కోసం ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సమయంలో అయినా బాక్సాఫీస్ ను షేక్ చెయ్యగలిగే ఈ నటుడు లేటెస్ట్ గా అక్కడి స్టార్ దర్శకుడు శివతో “అన్నాత్తే” అనే ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న ఈ చిత్రం తాలూకా షూట్ లేటెస్ట్ గా హైదరాబాద్ లో ప్లాన్ చేసారు.

కానీ ఉహించని విధంగా వారి క్రూ మెంబర్స్ కు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేగింది. అయితే అదే సమయంలో రజినికి నెగిటివ్ వచ్చింది అని వచ్చిన వార్త కాస్త ఊరటను ఇచ్చింది. కానీ ఇపుడు మళ్ళీ రజినీ ఆరురోగ్యం క్షీణించింది అని వచ్చిన వార్త మరోసారి ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది.

అయితే రజినీకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు కానీ ఆయన బీపీ లో అనుకోకుండా పడిపోవడం వల్ల తన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించినట్టు తెలుస్తుంది. దానిపైనే అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వారు వెల్లడించారు. అంతే కాకుండా వారు రజినీ బ్లడ్ ప్రెజర్ కుదుటపడే వరకు అక్కడే ఉంచబడతారు అని తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మరి రజినీ తొందరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

apollo rajinikanth

సంబంధిత సమాచారం

తాజా వార్తలు