విక్రమ్ “కోబ్రా” నుంచి మరో ఆసక్తికర పోస్టర్..ఇవి గమనించారా?

విక్రమ్ “కోబ్రా” నుంచి మరో ఆసక్తికర పోస్టర్..ఇవి గమనించారా?

Published on Dec 25, 2020 2:58 PM IST

chiyan vikram

మన దక్షిణాదిలో నటనలో ఎంత వరకు అయినా సరే వెళ్లగలిగే అతి కొద్ది మంది హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. అలా తన నటనే అన్ని వర్గాల్లో ప్రేక్షకుల్లో కూడా అత్యుత్తమంగా నిలబెట్టింది. ఎన్నో ప్రయోగాలు చేసిన చియాన్ లేటెస్ట్ గా మరో ఆసక్తికర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే “కోబ్రా” చిత్రం కోసం. ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20కి పైగా గెటప్పులు వేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఆ అంశంతో పాటుగా ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ క్రిస్మస్ సందర్భంగా సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇది కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రెండు వేరియేషన్స్ లో విక్రమ్ ఇందులో కనిపిస్తున్నాడు. ఒక సైంటిస్ట్ లా ఒకవైపు మరో వైపు అనేక లెటర్స్, ఫార్ములాస్ తో డిజైన్ చేసి కనిపిస్తున్నాడు.

అలాగే ఇందులో “ప్రతీ సమస్యకు కూడా ఒక మాథమెటికల్ పరిష్కారం ఉంటుంది” అని మరో ఇంట్రెస్టింగ్ లైన్ ను పెట్టారు.అలాగే పై నుంచి గమనిస్తే రెండు కళ్ళు కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ కూడా రెండు గెటప్సా అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి ఆర్ జ్ఞ్యాన ముత్తు దర్శకత్వం వహిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ ను ఎప్పటికి ప్లాన్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు