రజినీ కోలుకోవాలని పవన్ ప్రెస్ నోట్.!

రజినీ కోలుకోవాలని పవన్ ప్రెస్ నోట్.!

Published on Dec 25, 2020 4:02 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అన్నాత్తే” షూట్ నిమిత్తం హైదరాబాద్ కు కొన్ని రోజుల కితం రాగా వారి టీం కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. కానీ రజినీకి ఎలాంటి వైరస్ సోకకపోయినప్పటికీ తాజాగా ఆయన బ్లడ్ ప్రెజర్ డౌన్ అవ్వడం మూలాన కాస్త అస్వస్థతకు లోనయ్యారని వచ్చిన వార్త కాస్త బాధాకరం అనిపించింది. దీనితో ఆయన ఆరోగ్యం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చింత వ్యక్తం చేసారు.

వారి జనసేన పార్టీ తప్పు నుంచి ప్రెస్ నోట్ ద్వారా రజినీ ఆరోగ్యంపై తన స్పందనను తెలియజేసారు. ఆయనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోవడం ఊరటనిచ్చింది అని అస్వస్థతకు లోను కావడంతో మరోధైర్యం ఎక్కువగా ఉండే రజిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని అలాగే ఆద్యాద్మికపరులైన రజినీకి భగవానుగ్రహం కలగాలని ఆయన ఎంతగానో కొలిచే మహావతార్ బాబాజీ ఆశీస్సులుతో రజినీ మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని పవన్ ప్రెస్ నోట్ ద్వారా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు