పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో విద్యార్థి, త్వరలో విడుదల.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో విద్యార్థి, త్వరలో విడుదల.

Published on Dec 25, 2020 9:00 AM IST

vidyarthi

మ‌హాస్ క్రియేష‌న్స్ పతాకం పై మ‌ధు బాబు దర్శకత్వం లో ‘రాజుగారి గ‌ది’ ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) మరియు రామకృష్ణ రేజేటి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘విద్యార్థి’. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలోనే థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా దర్శకుడు మధు బాబు మాట్లాడుతూ “ముందుగా మా విద్యార్థి టీం తరుపున తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా విద్యార్థి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలోనే థియేటర్స్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది. హీరో చేతన్ చీను అద్భుతమైన నటన, మంచి సంగీతం, ఆలోచింపజేసే డైలాగు లతో ఒక అందమైన సినిమా ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరికి నచ్చుతుంది అనే నమ్మకం నా కుంది” అని తెలిపారు.

నిర్మాతలు ఆళ్ల వెంకట్ మరియు రామకృష్ణ రేజేటి మాట్లాడుతూ “మా విదార్థి సినిమా టీజర్ ను చాలా బాగా ఆదరించారు. మా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది, మా సినిమాకు పని చేసిన అందరూ టెక్నీషయన్స్, ఆర్టిస్ట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కెమెరా మాన్ పనితనం సినిమా కి ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. మధు బాబు దర్శకత్వం, బల్గానిన్ సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమా కి మంచి హైప్ తీసుకొస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మా సినిమా ని థియేటర్ లో విడుదల చేస్తాము” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు