అందరి హీరోలకు అభిమానులు తనకి మాత్రం తన అభిమానులు ఒక ఆర్మీ అని చెప్పుకుంటాము స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఆ రేంజ్ లోనే బన్నీ పై తమ ప్రేమను వ్యక్త పరుస్తారు వారు కూడా. బన్నీ ప్రతీ సినిమాకు ఇంట్రడ్యూస్ చేసే డ్రెస్సింగ్ స్టైల్ కానీ హైర్ స్టయిలే కానీ ఏదన్నా సరే బన్నీ తర్వాతే అనే రేంజ్ అభిమానులు చాలా మందే ఉన్నారు.
అందుకే బన్నీ కూడా తన అభిమానులు అంటే మరింత అమితమైన ప్రేమ కనబరుస్తారు. మరి అలాంటి అభిమానులు అంటే తన మనసులో ఎలాంటి స్థానం ఉందో వారి స్ట్రీమింగ్ యాప్ ఆహా లోని సమంతా తో చేస్తున్న “సామ్ జామ్” స్పెషల్ ఎపిసోడ్ లో చెప్పారు. ఈ కొత్త ఏడాది సందర్భంగా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమోలో సామ్ బన్నీను చాలా ప్రశ్నలే అడిగారు.
అలా ఫ్యాన్స్ కోసం ప్రస్తావన వచ్చినపుడు తన తల్లిదండ్రుల ప్రేమ ఎలా అయితే ఏమీ ఆశించకుండా ఉంటుందో మళ్ళీ తన అభిమానుల ప్రేమ మాత్రమే అలా ఉంటుంది అని వారిది తనపై ఒక అన్ కండీషనల్ లవ్ అని తన తల్లి దండ్రుల తర్వాత స్థానాన్ని తన మనసులో అభిమానులకే ఇచ్చాడు. మరి ఏ అభిమానికి అయినా ఇలాంటిది చాలదా తాము అభిమానించే హీరో అలాంటి స్థానంలో వాళ్ళని పెట్టుకుంటే.
"Fans' Love is Unconditional ♥"
Here's a glimpse of #SamJam with Stylish Star @alluarjun.Full episode premieres 01.01.2021 #SamJamWithAA #AlluArjun @Samanthaprabhu2 #AlluAravind @thesamjamshow pic.twitter.com/Jha08LUHe8
— ahavideoin (@ahavideoIN) December 27, 2020


