సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పరశురామ్ డీసెంట్ కామెడీ ట్రాక్ ను రాశాడని, వెన్నెల కిషోర్, పోసాని మధ్య సాగే ఈ కామెడీ ట్రాక్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఈ ట్రాక్ మొత్తం సెకెండ్ హాఫ్ లో వస్తోందట. అలాగే ఈ ట్రాక్ లో అనసూయ కూడా ఉంటుందట. వీళ్ళ ముగ్గురి మధ్య ఫుల్ కన్ ఫ్యూజన్ డ్రామా ఉంటుందట.
అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్ గా నటించనున్నాడు. ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.


