బాలయ్య కోసం పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్ ?

బాలయ్య కోసం పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ రోల్ ?

Published on Dec 28, 2020 11:04 AM IST

Puneeth Rajkumar

నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా నుండి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని.. పునీత్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా పునీత్ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు