షూటింగ్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరో !

షూటింగ్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరో !

Published on Dec 28, 2020 12:44 PM IST

Rajasekhar 1

సీనియర్ హీరో డా. రాజశేఖర్ ప్రస్తుతం ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన షూట్ యాదగిరిగుట్ట ప్రాంతంలో మొదలైందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం చేస్తోన్న ఈ షెడ్యూల్ లో రాజశేఖర్ పై సోలో షాట్స్ తీస్తున్నారట. అలాగే వచ్చే షెడ్యూల్ షూటింగ్ ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి వికారాబాద్ లో మొదలపెట్టనున్నారు.

ఈ షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. కాగా ఎమోషనల్ సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారట. ఇక రాజశేఖర్ గరడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రం పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకుడు వీరభద్రం చౌదరి గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుని.. ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీస్తున్నాడట. మరి రాజశేఖర్ కి ఈ చిత్రం ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. మొత్తానికి హీరోగా కొనసాగడానికి రాజశేఖర్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు