
కొత్త ఏడాది అలాగే సంక్రాంతి సీజన్ వస్తుండడంతో మళ్ళీ సినిమా పండుగ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది. ఇక ఈ సిసలైన పండుగలు అంటే కొత్త సినిమాల నుంచి సరికొత్త అప్డేట్లు తో మోత మోగాల్సిందే. మరి అలా ఈ సీజన్ కు మంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన టీజర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” టీజర్ కూడా ఒకటి.
మరి ఈ టీజర్ కోసం ఇప్పుడిప్పుడే పాజిటివ్ వైబ్స్ కూడా మొదలయ్యాయి. మరి ఈ టీజర్ కోసం ఇప్పుడొక సాలిడ్ అప్డేట్ వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అది కూడా ఈ అర్ధ రాత్రి 12 గంటలకు దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచే దానిపై అప్డేట్ ను ఓ స్పెషల్ పోస్టర్ తో వదలనున్నట్టు వినికిడి. మరి ఈ అప్డేట్ వస్తుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం ఇచ్చాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.

