స‌ప్త‌గిరి ‘ఎయిట్’ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

స‌ప్త‌గిరి ‘ఎయిట్’ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

Published on Jan 1, 2021 6:00 PM IST

8

స‌ప్త‌గిరి క‌థానాయ‌కుడిగా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా రూపొంద‌నున్న చిత్రం ‘ఎయిట్‌’. సూర్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ బ‌హుభాషా చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావ‌డం వ‌ల్లే నాలుగు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ఇల్యూజ‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తుండ‌గా, ఖుషి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈరోజు ‘ఎయిట్‌’లో స‌ప్త‌గిరి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇన్‌టెన్స్ లుక్‌లో స‌ప్త‌గిరి ఆక‌ట్టుకుంటున్నారు. కోటు ధ‌రించి ఉన్న స‌ప్త‌గిరి స్టైల్‌గా సిగ‌రెట్ తాగుతుండ‌గా, చేతికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపిస్తున్నాయి. స‌ప్త‌గిరికి ఉన్న ఇమేజ్‌కు త‌గిన‌ట్లు చిత్రంలో వినోదానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.ఎన్‌.ఎస్‌. ప్ర‌సు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి న‌జీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, వంశీ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు