చంద్రిక కంచర్ల డిజైనింగ్‌ స్టూడియో ప్రారంభం

చంద్రిక కంచర్ల డిజైనింగ్‌ స్టూడియో ప్రారంభం

Published on Jan 3, 2021 7:00 AM IST

Chandrika Kancherla

ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, సెలబ్రిటీలకు డిజైనింగ్‌ చేయాలని ప్రతి డిజైనర్‌ కోరుకుంటారు. అలా అనుకునే ప్రతి డిజైనర్‌ ముందుగా స్టోర్‌ ప్రారంభించి తమ ఉత్పత్తులను సెలబ్రిటీల దాకా చేరలనుకుంటారు. కానీ ప్రముఖ డిజైనర్‌ చంద్రిక కంచర్ల ఫ్యాషన్ రంగంలో ముందుగా రచ్చగెలిచిన తర్వాత ఇంటగెలవటానికి రెడీ అయ్యారు. ఆమె గతంలో ఎందరో సెలబ్రిటీలకు తన క్రియేటివ్‌ థాట్స్‌తో ఫ్యాషన్ డిజైనింగ్‌ రంగంలో తనకు తానుగా బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘ చంద్రిక కంచర్ల’ డిజైనింగ్‌ స్టూడియోను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం 44లో అధునాతన షోరూమ్‌ను భారీవ్యయంతో ప్రారంభించారు.

చంద్రిక మాట్లాడుతూ. నా దగ్గరకు వచ్చే క్లైయింట్స్‌ తాము ధరించిన బట్టలు ఎంతో బావున్నాయని ఒక మెసేజ్‌ చేస్తే చాలా ఆనందం పొందుతాను. అదే ఉత్సాహంతో మార్కెట్‌తో పోటీపడుతూ కొత్త ఫ్యాషన్ లను అందుబాటులోకి తీసుకురావటం నా బాధ్యతగా ఫీలవుతున్నాను. ఈ స్టోర్‌లో వెడ్డింగ్‌ కలెక్షన్స్ కు సంబంధించి ఉమెన్, మేన్స్ కి స్పెషల్‌గా డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చాను అన్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ మాట్లాడుతూ–‘ చంద్రిక ‘డిజైన్లకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆమె కలెక్షన్స్ ను నేను ఎన్నో ఏళ్లుగా యూజ్‌ చేస్తున్నాను. షీ ఈజ్‌ వెరీ ఫ్రెండ్లీ అండ్‌ ఫ్యామిలీ టు మీ. అలాగే జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆమెంటే నాకెంతో అభిమానం అన్నారు. నటి,నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– మనం ఏది కొనుక్కోవాలన్న మొదట సెలక్షన్‌ ఇంపార్టెంట్‌. అలా ప్రతి ఒక్కరికి నచ్చే సెలక్షన్‌ స్టఫ్‌ని ఒకేచోట అందించటం ‘చంద్రిక స్పెషల్‌ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు