మహేష్ సినిమాలో ‘రేణూ దేశాయ్’ క్యారెక్టర్ అదే !

మహేష్ సినిమాలో ‘రేణూ దేశాయ్’ క్యారెక్టర్ అదే !

Published on Jan 3, 2021 10:31 PM IST

renu desai

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ సిస్టర్ పాత్ర ఉందని.. ఆ పాత్రలో రేణూ దేశాయ్ నటించబోతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, రేణూ దేశాయ్, మహేష్ కి వదినగా నటించబోతుందని.. ఇప్పటికే ఈ పాత్ర విషయంలో రేణూ దేశాయ్ కూడా బాగా ఎగ్జైట్ గా ఉందని తెలుస్తోంది.

ఇక భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

అదే విధంగా ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు