‘యానిమల్’లో టాలెంటెడ్ బ్యూటీ !

‘యానిమల్’లో టాలెంటెడ్ బ్యూటీ !

Published on Jan 4, 2021 7:58 PM IST

tripthi

అర్జున్‌ రెడ్డి అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి.. రెండు ప్రధాన భాషల్లో తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. కాగా సందీప్ తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేయబోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీగా రానున్న ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టారు.

కాగా ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటి కూడా నటించబోతుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ‘త్రిప్తీ డిమ్రీ’ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుంది. క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఇప్పటికే ప్రీ-లుక్ టీజర్ లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో కథను కూడా వినిపించారు కూడా. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు