
తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తుంది ఉప్పెన మూవీ. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో తెరకెక్కిన సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు పట్టం కట్టారు. మొదటివారానికే 70కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఉప్పెన సరికొత్త రికార్డు నమోదు చేసింది. డెబ్యూ యాక్టర్స్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల నటనతో పాటు, విజయ్ సేతుపతి ప్రెజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
దర్శకుడు బుచ్చి బాబు సానా ప్రేమ కథకు ఓ వినూత్నమైన ముగింపు ఎంచుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ సెలెబ్స్ ఈ చిత్రాన్ని చూసి దర్శకుడు ప్రతిభను మెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేక షోలను నిర్మాతలు ఏర్పాటు చేశారు.
కాగా నందమూరి నటిసింహం బాలకృష్ణ తన కుటుంబంతో పాటు ఉప్పెన మూవీని వీక్షించారు. అలాగే దర్శకుడు బుచ్చి బాబు బాలయ్యతో ఫోటోలు దిగి తన సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పెన నిర్మాతలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉప్పెన చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బుచ్చి బాబుతో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

