ఫాస్టెస్ట్ 50 మిలియన్ తో సాయి పల్లవి మాస్ రికార్డ్..!

ఫాస్టెస్ట్ 50 మిలియన్ తో సాయి పల్లవి మాస్ రికార్డ్..!

Published on Mar 14, 2021 10:27 PM IST

saranga dariya
ఇటీవల కాలంలో ఓ సినిమా ఫలితాన్ని డిసైడ్ చెయ్యడానికి ఆడియో ఎంత బాగా పని చేస్తుందో చూస్తూనే ఉన్నాము. మరి అలాగే హీరోల సినిమాల పాటలకు మంచి రికార్డులు వస్తున్న ఈ ట్రెండ్ లో నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి పేరు కూడా ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసుకుంది. మంచి చార్ట్ బస్టర్ సాంగ్ కు తన గ్రేస్ మిక్స్ అయితే మళ్ళీ సాలిడ్ రికార్డులను సెట్ చెయ్యొచ్చని ప్రూవ్ అయ్యింది.

లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల అయ్యాయి కానీ సాయి పల్లవి పై డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ “సారంగ దరియా”కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

జస్ట్ రెండు రోజుల కితమే 40 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిన ఈ సాంగ్ ఈ కొద్ది లోనే 50 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి టాలీవుడ్ లోనే నయా రికార్డును సెట్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో సాయి పల్లవి మళ్ళీ తన మాస్ చూపించిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక పవన్ సి హెచ్ సంగీతం ఇచ్చిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం వచ్చే ఏప్రిల్ 16న విడుదల కానుంది.

తాజా వార్తలు