రామకృష్ణ తోట దర్శకత్వం లో ఎన్ ఎస్ సినీ ఫ్లెక్స్ పతాకం పై యామిని కృష్ణ నిర్మించిన చిత్రం పరిగెత్తు పరిగెత్తు. ఈ చిత్రం లో సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య లు హీరో హీరోయిన్ లుగా నటించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. అయితే ఈ నెల 30 వ తేదీన చిత్రం థియేటర్ల లో విడుదల కాబోతుంది.
అయితే ఈ నేపథ్యం లో చిత్ర దర్శకుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ పరిగెత్తు పరిగెత్తు చిత్రం ను థియేటర్ రిలీజ్ కి తీసుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి కాగా, చాలా బాగుంది అంటూ రిపోర్ట్ వచ్చింది అని తెలిపారు. అయితే వాళ్ళ అభినందన లతో సినిమా మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఉత్సాహం తో జూలై 30 న థియేటర్ల లో మూవీ ను విడుదల చేయబోతున్నాం అని అన్నారు. అయితే ప్రేక్షకులను నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి అని, ఇప్పటి దాకా విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలిపారు. థియేటర్ల లో కూడా ఇదే తరహాలో స్పందన వస్తుందని ఆశిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.


