ఆగస్టు 13న రాబోతున్న ‘సుందరి’ !

ఆగస్టు 13న రాబోతున్న ‘సుందరి’ !

Published on Aug 1, 2021 8:00 PM IST

sundari

నటి పూర్ణ ప్రధాన పాత్రలో, అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మేంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఆదివారం చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే సుందరి సినిమా థియటర్స్ లో విడుదల అవుతుంది .. ఆగస్టు 13 అంటే ఇప్పటినుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంత కంఫర్టబుల్ గా ఈ సినిమా చేయడానికి కారణం నా టీం. ఇది నా టీమ్ కాదు ఫ్యామిలీ అని చెప్పాలి. ఇక నిర్మాతగారు నన్ను లీడ్ రోల్ లో పెట్టి ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా చాలా కొత్త తరహాలో ఉంటుంది .. అందరికి తప్పకుండా నచ్చేలా ఉంటుంది. మీరంతా ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో అర్జున్ మాట్లాడుతూ … ఈ టీం గురించి చెప్పాలంటే .. రిజ్వాన్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు… మంచి పనులకు అయన ప్రోత్సహం ఉంటుంది. అలాగే పూర్ణ గారి సూపర్ యాక్టర్, తోటి నటీనటులకు సపోర్ట్ అందిస్తుంది. డైరెక్టర్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్ ఉన్న దర్శకుడు, ప్రతి విషయం పై క్లారిటీ ఉన్న వ్యక్తి. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారి ఆర్ ఆర్ చూసాకా ఆయనకు ఫ్యాన్ అయ్యాను. అంత బాగా చేసాడు. మా సినిమాని తప్పకుండా మీ అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ … నిజంగా అందరికి థాంక్స్ చెప్పాలి. సినిమా బిజినెస్ చాలా బాగుంది.. తెలుగుకంటే ముందే తమిళంలో బిజినెస్ అయిపొయింది. మలయాళంలో పూర్ణ స్టార్ హీరోయిన్ కాబట్టి అక్కడ సూపర్ గా బిజినెస్ జరిగింది. ఇక హీరో అర్జున్ చాలా అద్భుతంగా నటించాడు. కరోనా తరువాత థియటర్స్ లోకి వస్తున్న సుందరిని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు