పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక మాస్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారని టాక్ ఆల్రెడీ ఉన్న సంగతి తెలిసిందే.
మరి ఆ టాక్ ని నిజం చేస్తూ మేకర్స్ ఒక మాసివ్ పోస్టర్ నే రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఈ పండుగకు పవన్ అభిమానులు సహా రానా అభిమానులకి పూనకాలు తెప్పించేదిలా ఉందని చెప్పడంలో డౌటే లేదు.. ఓ పక్క నక్సలైట్ గెటప్ లో కనిపిస్తున్న పవన్ మరో పక్క పక్కా మాస్ స్వాగ్ లో డానియల్ శేఖర్ గా కనిపిస్తున్న రానా ఈ పోస్టర్ తో అదరగొట్టేసారు.
అలాగే ఇదే పోస్టర్ తో సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25నే అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం ఈ కొత్త పోస్టర్ గట్టి ట్రీట్ నే ఇస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు! ✨
– Team #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/1qvzPE90YC
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2022