యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్2. కేజీఎఫ్ కి కొనసాగింపు గా వచ్చిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా థియేటర్ల లో రన్ అవుతూ, ఆల్ టైమ్ రికార్డు లను ఎన్నో నెలకొల్పింది. ఈ చిత్రం నుండి తాజాగా తుఫాన్ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ పాట విడుదల అయ్యింది.
శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.