వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయిన సీతా రామం చిత్రం కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు డీసెంట్ గా స్టార్ట్ అయినా, రెండో రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వనీ దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు హను తన కవిత్వ కథనానికి సినీ ప్రేమికులు, ప్రముఖులు, విమర్శకులు, సాధారణ ప్రేక్షకులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
హను సినిమాని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా ఎలిగెంట్‌గా క్యారీ చేశాడని, ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతను చిత్రానికి భారీ డెప్త్ తెచ్చాడని మరియు అందరు ఆర్టిస్టుల నుండి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టాడని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రమోషన్లలో వాగ్దానం చేసినట్లుగా అతను తెలుగు ప్రేక్షకుల కోసం ఒక అందమైన చిత్రాన్ని అందించాడు. ఇది ఉత్తమ ప్రేమకథలలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. హను రాఘవపూడి తను పొందుతున్న ప్రశంసలన్నిటికీ అర్హుడే అని చెప్పాలి.