అద్దిరిపోయే టైటిల్ తో డీజే టిల్లు సీక్వెల్…హీరోయిన్ ఎవరంటే?

అద్దిరిపోయే టైటిల్ తో డీజే టిల్లు సీక్వెల్…హీరోయిన్ ఎవరంటే?

Published on Oct 24, 2022 5:06 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ డీజే టిల్లు 2 షూట్‌ను ఇటీవలే కిక్‌స్టార్ట్ చేసాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. దీపావళి పండుగ సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ప్రోమోను విడుదల చేసారు. ఈ వీడియో లో సినిమా యొక్క అధికారిక టైటిల్ టిల్లు స్క్వేర్ అని వెల్లడించింది.

ఈ చిత్రాన్ని మార్చి 2023లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది దాని ప్రీక్వెల్ కంటే మరింత ఫన్నీగా మరియు రొమాంటిక్ గా ఉంటుంది. టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు రిలీజ్ చేసిన ప్రోమో వీడియో ఆద్యంతం సరదాగా, ఆకట్టుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు