ప్రస్తుతం మన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడ పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాల్లో అయితే తెలుగు సహా తమిళ్ నుంచి కూడా రవితేజ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “మట్టి కుస్తీ” కోసం తెలిసిందే. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని అయితే రేపు నవంబర్ 2న ఉదయం 11 గంటల సమయంలో లాంచ్ చెయ్యనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని రవితేజ తో పాటుగా విష్ణు విశాల్ కూడా నిర్మాణం వహిస్తున్నాడు. మరి ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.
The game is about to begin!#GattaKusthi #MattiKusthi
First look at 11AM on the 2nd of November ????
Are you ready? pic.twitter.com/8uC3ONDokx
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) November 1, 2022