“విశ్వంభర” నుంచి అద్భుత మనిపించేలా త్రిష లుక్ పోస్టర్

“విశ్వంభర” నుంచి అద్భుత మనిపించేలా త్రిష లుక్ పోస్టర్

Published on May 4, 2024 12:02 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల తర్వాత తమ కలయికలో చేస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత చిరు నుంచి భారీ ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తుండగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక స్పెషల్ అప్డేట్ ని అందించారు.

ఈరోజు త్రిష పుట్టినరోజు కానుకగా అయితే ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రివీల్ చేసిన ఈ పోస్టర్ లో త్రిష లుక్ మాత్రం అద్భుతం అనిపించేలా ఉందని చెప్పాలి. ఆమె కాస్ట్యూమ్ కానీ మెడలో నగ దానికి తోడు త్రిష అందం ఈ పోస్టర్ ని హైలైట్ గా చేసాయి.

ఇక బ్యాక్గ్రౌండ్ లో సినిమా మార్క్ పంచభూతాల నక్షత్రం డిజైన్ తో చూసినవెంటనే అబ్బురపరిచేలా అనిపిస్తుంది. అలాగే దీనితో త్రిష పాత్ర సినిమాలో చాలా ప్రత్యేకంగా కనిపించేలా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మేకర్స్ త్రిష అభిమానులకి ఒక ట్రీట్ లాంటి పోస్టర్ ని అందించారు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు