అఫీషియల్ : విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా ఖరారు

అఫీషియల్ : విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా ఖరారు

Published on May 4, 2024 11:17 AM IST

మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” (The Family Star) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాని దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా వసూళ్లు పెద్దగా రాబట్టలేదు.

అయినా కూడా దిల్ రాజు విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నట్టుగా పలు రూమర్స్ రావడం ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ అందించారు.

ఇది దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ సినిమాగా రాబోతున్నట్టుగా తెలియజేసారు. ఓ పరాజయం తర్వాత విజయ్ ని నమ్మి దిల్ రాజు సినిమా వెంటనే అనౌన్స్ చేయడం ఇక్కడ గమనార్హం దీనితో విజయ్ మార్కెట్ పై తనకి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవాలి. ఇక ఈ సినిమా సంబంధించి ఈ మే 9న మరిన్ని వివరాలు అందిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు