“ఇండియా లాక్ డౌన్”..కంగారులో నెటిజన్స్.!

“ఇండియా లాక్ డౌన్”..కంగారులో నెటిజన్స్.!

Published on Nov 9, 2022 8:00 AM IST

గత రెండేళ్ల కితం ఉన్న పరిస్థితులు ఎవరూ మర్చిపోలేనివి కరోనా వైరస్ మూలాన నెలకొన్న సంక్షోభం దానితో ఏర్పడిన లాక్ డౌన్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాక్సిన్ కనుక్కోవడం ఇప్పుడు అంతా బాగా తగ్గడంతో మళ్ళీ మునుపటి పరిస్థితుల్లాగా నెలకొన్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి అలాగే ఈరోజు ఉదయం ఇలా సోషల్ మీడియా ఓపెన్ చేసిన వాళ్ళకి “ఇండియా లాక్ డౌన్” అంటూ ఓ ట్యాగ్ ట్రెండింగ్ లో కనిపించింది.

దీనితో మళ్ళీ ఇండియా లాక్ డౌన్ అంటూ షాక్ అయ్యారు. అయితే దీనిపై అసలు విషయం తెలుస్తుంది. ఇది నిజమైన లాక్ డౌన్ కాదు ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 వారు రిలీజ్ ఒరిజినల్ చిత్రం “ఇండియా లాక్ డౌన్”. అప్పుడు లాక్ డౌన్ సమయంలో భారదేశంలో నెలకొన్న పరిస్థితులపై తెరకెక్కించిన చిత్రం ఇది. దీనితో ఈ సినిమా ట్రెండ్ అవుతుండగా తెలీని వారు అయితే మళ్ళీ లాక్ డౌన్ ఏంటి అని కంగారు పడుతున్నారు. అయితే ఇది అందులోని అసలు సారాంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు