లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచినటువంటి మరో చిత్రం “హిట్ 2”. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం అయితే ప్రతి రోజు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటూ దూసుకెళ్తుండగా మన టాలీవుడ్ లెజెండ్స్ నుంచి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
ఇక రీసెంట్ గానే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యగా లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ ఆడియెన్స్ అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్.. అంతా ప్రేమగా పిలుచుకునే వెంకీ మామ ఈ చిత్రాన్ని చూశాయి అదిరే రెస్పాన్స్ ని అందించారు.
మరి సినిమా చూసిన తర్వాత శైలేష్ కొలనుతో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది అని తమ టీం అంతా ఫెంటాబ్యులస్ జాబ్ అందించారని తెలపడంతో శైలేష్ ఆనందం వ్యక్తం చేసాడు. మరి దీనిపై హీరో అడివి శేష్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వెంకీ మామకి ధన్యవాదాలు తెలియజేసాడు.
Thank you so much @VenkyMama sir. It’s a huge Victory for us (Don’t mind the pun ❤️) Glad you loved the film. Venky sir found the film very gripping with a huge Tension spike ❤️????????#HIT2 pic.twitter.com/2rt6yeFNc2
— Adivi Sesh (@AdiviSesh) December 6, 2022