ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 23వ ఎడిషన్ అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగింది. ఈ అవార్డ్ షోకి హృతిక్ రోషన్, అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, మాధవన్, మౌని రాయ్, దియా మీర్జా మరియు రెహమాన్‌లతో సహా పలువురు ప్రముఖులు వచ్చారు. ఈ అవార్డు వేడుకలో, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు ఇండియన్ సినిమాలో అత్యుత్తమ అచీవ్మెంట్ IIFA అవార్డును ప్రదానం చేశారు. ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు కమల్ హాసన్.
వివిధ భాషల్లో తన సత్తాను నిరూపించుకున్న నటుడు కమల్ హాసన్. కెరీర్లో, కమల్ అనేక రకాల పాత్రలను పోషించాడు, చాలా మంది ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కమల్‌ను పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది. కమల్ హాసన్ నాలుగు జాతీయ అవార్డులు మరియు 17 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ షణ్ముఖం దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు, అది వచ్చే ఏడాది విడుదల కానుంది.