“భోళా శంకర్” ఆగమనంలో నో చేంజ్.!

“భోళా శంకర్” ఆగమనంలో నో చేంజ్.!

Published on May 30, 2023 7:37 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “భోళా శంకర్” కోసం తెలిసిందే. మరి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఈరోజే మ్యూజికల్ అప్డేట్ ని కూడా అందించారు. ఇక గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని రూమర్స్ అలా వైరల్ అవుతూ ఉన్నాయి.

అసలుకే ఈ ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన సినిమాని ఆగష్టు కి వాయిదా వేశారు. మళ్ళీ అక్కడ పైనుంచి కూడా వాయిదా ఉంటుంది అని అయితే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కాగా ఈరోజు అప్డేట్ తో కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. సినిమా రిలీజ్ లో ఎలాంటి డౌట్ లేదు ఆగష్టు 11 నే సినిమా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే మెగాస్టార్ భోళా శంకర్ ఆగమనంలో అయితే ఎలాంటి మార్పు లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు