పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతుండగా ఈ గ్యాప్ లో వచ్చిన ప్రభాస్ బర్త్ డే కి మేకర్స్ నుంచి డిజప్పాయింట్మెంట్ నే మిగిలింది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో అయితే ఒక క్రేజీ బజ్ మొదటి నుంచి అయితే ఉంది.
దీనితో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యినా కూడా ఇండియా వైడ్ గా మాత్రం రిలీజ్ రోజు అర్ధ రాత్రి 12 గంటలు నుంచే అన్ని చోట్ల షోస్ పడతాయి అనే ప్లాన్ ఉంది. అయితే ఈ ప్లాన్ ఇప్పటికీ కూడా ఆన్ లోనే ఉందని తెలుస్తుంది. జస్ట్ అనుమతులు దొరకాలి కానీ సలార్ అయితే ఇండియా వైడ్ గా ఇదే విధంగా రిలీజ్ చేయాలనే మేకర్స్ డిసైడ్ అయ్యారట. మరి ఈ సాలిడ్ ప్లానింగ్ రిలీజ్ నాటికి వచ్చేసరికి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.


