రవితేజ తో నాలుగోసారి…డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇంట్రెస్టింగ్ పోస్ట్!

రవితేజ తో నాలుగోసారి…డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Oct 25, 2023 8:35 PM IST

raviteja 1

మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టాయి. అయితే వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అంటేనే అందరిలో ఆసక్తి నెలకొంది.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలను నేడు కొన్ని వెల్లడించారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. నాలుగోసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి ఎంతో స్పెషల్ అని, లెట్స్ రాక్ మాస్ మహారాజ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజా వార్తలు