
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “జైలర్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అలాగే తాను ఆల్ మోస్ట్ హీరో రేంజ్ పాత్రలోనే కనిపించిన “లాల్ సలాం” చిత్రం రీసెంట్ గా వచ్చి డిజాస్టర్ అయ్యింది. మరి ఈ సినిమా ఫలితంతో డిజప్పాయింట్ గా ఉన్న తలైవర్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇపుడు వచ్చింది. ప్రస్తుతం రజినీ చేస్తున్న లైనప్ లోకి బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత రచయితా మరియు దర్శకుడు అయినటువంటి సాజిద్ నడియాడ్వాలా రేస్ లోకి వచ్చారు.
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు నిర్మతగా చేసిన తాను సల్మాన్ ఖాన్ తో “కిక్” చిత్రానికి హిందీలో చేశారు. మరి ఇపుడు రజినీకాంత్ అయితే సాజిద్ కి ఓ భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో మరిన్ని డీటెయిల్స్ అత్తో త్వరలోనే రానున్నాయని చెప్పాలి. ఇప్పుడు రజినీ దర్శకుడు టి జి జ్ఞ్యానవేల్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ల సినిమాలు ఓకే చేసి లైన్ లో ఉంచారు. వాటిలో వేల్ తో “వెట్టాయన్” షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

