సినిమా నటులు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు సినిమాల్లో కూడా నటించారు. ఐతే, సినిమాల్లో నటించడంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే సినిమాల్లో నటించేందుకు తాను రెడీగా ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదురు యాంకర్, అంబటి రాంబాబుతో ‘మీరు సినిమాల్లో నటించొచ్చు కదా’ అంటూ వచ్చిన ఓ కామెంట్ పై స్పందించాలని కోరారు.
ఆ కామెంట్ కి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘సినిమాల్లో నటించడం తప్పుకాదు కదా, వయసు, హోదాకు తగినట్లు హుందా ఉన్న పాత్ర వస్తే నేను కచ్చితంగా నటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘మన దేశంలో సినిమా, రాజకీయ రంగాలు రెండు బాగా పాపులర్ రంగాలు, ఇప్పటివరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది రాణించారు, కాబట్టి.. నేను రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి రెడీ’ అని ఆయన తెలిపారు.


