విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. 12వ రోజు ముగిసే సమయానికి, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లు వసూలు చేసింది, వెంకటేష్ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలవడం నిజంగా విశేషమే. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ & తెలంగాణలో కూడా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఈ రోజు ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి కొన్నిచోట్ల సాలిడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. పైగా కొన్ని చోట్ల షోస్ కూడా ఫుల్ అయ్యాయట. మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది ఈ సినిమా. నిజానికి ప్రీమియర్ నుంచి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది.
కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొత్తమ్మీద భారీ విజయాన్ని సాధించింది. మొదటి నుండి ఈ సినిమా ప్రమోషన్లు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో, టికెట్ బుకింగ్లు నేటికీ భారీగానే బుక్ అయ్యాయి.


