మరోసారి ‘ఫౌజీ’ కాంబినేషన్ రిపీట్..?

మరోసారి ‘ఫౌజీ’ కాంబినేషన్ రిపీట్..?

Published on Apr 2, 2025 3:59 PM IST

Prabhas HanuRaghavapudi m

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్తో దర్శుకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’తో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ అనే సినిమాను తెరకెక్కిస్తు్న్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పీరియాడిక్ లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది.

అయితే, ఈ సినిమాను హను రాఘవపూడి హ్యాండిల్ చేస్తున్న తీరుకి ప్రభాస్ ఫిదా అయ్యాడట. దీంతో ఈ సినిమాను పూర్తి చేయకముందే, హను రాఘవపూడితో మరో సినిమాను చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ రెడీ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఫౌజీ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు