Ustaad Bhagat Singh : అభిమానుల కోసం పవన్ ముందుకొచ్చాడు.. మరి టికెట్ రేట్ల మాటేంటి..?

Ustaad Bhagat Singh : అభిమానుల కోసం పవన్ ముందుకొచ్చాడు.. మరి టికెట్ రేట్ల మాటేంటి..?

Published on Mar 5, 2026 8:02 PM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై హైప్‌ను పెంచాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

తొలుత మార్చి 26, 2026న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ, ఇప్పుడు మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల విషయంపై ఇప్పుడు అందరి చూపు ఉంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు నో చెబుతుండటంతో ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి నెలకొంది.

అయితే, ఏపీలో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర టికెట్ రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ చిత్ర టికెట్ రేట్ల విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు