మజిలీ దర్శకుని చేతులు మీదగా ‘డియర్ ఉమ’ టీజర్..!

మజిలీ దర్శకుని చేతులు మీదగా ‘డియర్ ఉమ’ టీజర్..!

Published on Apr 8, 2025 7:38 AM IST

majili

మన తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డియర్ ఉమ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. తాజాగా డియర్ ఉమ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ హిట్ దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన శివ నిర్వాణ చిత్రయూనిట్‌ను అభినందించారు. టీజర్ ఎంతో బాగుందని, ప్రేమతో పాటుగా అంతర్లీనంగా మంచి సందేశాన్నిచ్చే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లా ఉండబోతోందని అన్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు