IPL 2025 : చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ ఘన విజయం

IPL 2025 : చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ ఘన విజయం

Published on Apr 9, 2025 12:00 AM IST

csk

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన CSK vs PBKS మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన్ ప్రియాంశ్ ఆర్య(103) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ జట్టుకు ఒంటిచేత్తో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆయనకు తోడుగా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇక చివర్లో శశాంక్ సింగ్(52 నాటౌట్), మార్కో జన్సెన్ (34 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పంజాబ్ 219 పరుగులు చేసింది.

ఇక 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర(36), డివోన్ కాన్వే(69) జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె(42), ఎంఎస్ ధోని(27) స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఓటమి అనివార్యం అయ్యింది. దీంతో 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. దీంతో చెన్నైపై పంజాబ్ 18 పరుగులతో విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు