వకీల్ సాబ్ విషయంలో థమన్ ఎమోషనల్..!

వకీల్ సాబ్ విషయంలో థమన్ ఎమోషనల్..!

Published on Apr 10, 2025 7:03 AM IST

VakeelSaab m

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన కం బ్యాక్ సినిమా వకీల్ సాబ్ కోసం తెలిసిందే. మరి పవన్ కెరీర్లో సాలిడ్ హైప్ నడుమ అది కూడా కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ కూడా అందుకుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు అయ్యిన సందర్భంగా మేకర్స్ సహా అభిమానులు కూడా మరోసారి ఆరోజులు గుర్తు తెచ్చుకున్నారు.

అలాగే సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా విషయంలో ఎమోషనల్ అయ్యాడు. ఒక స్పెషల్ వీడియో కూడా షేర్ చేసుకొని మొదటిసారి పవన్ తో చేసిన వకీల్ సాబ్ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ నిర్మాత దిల్ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వకీల్ సాబ్ ఎమోషనల్ జర్నీ పట్ల ఎమోషనల్ గా ఆనందం వ్యక్తం చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు