ఇంటికి చేరుకున్న పవన్ కుమారుడు.. ఎమోషనల్ పోస్ట్‌తో రివీల్ చేసిన మెగాస్టార్

ఇంటికి చేరుకున్న పవన్ కుమారుడు.. ఎమోషనల్ పోస్ట్‌తో రివీల్ చేసిన మెగాస్టార్

Published on Apr 10, 2025 10:01 PM IST

chiru p

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్, మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. అయితే, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. మీ అందరికీ నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు, మా కుటుంబం యావన్మంది తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అంటూ చిరంజీవి తన పోస్ట్‌లో వెల్లడించారు.

పవన్ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతను త్వరగా పూర్తిగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు