దక్షిణాది భాషలు తమిళ, కన్నడ, మళయాళంలో పలు సినిమాలు చేసిన యువ నటి అర్చన సింగ్ పేరు సుపరిచితమే. ‘బిజినెస్ మేనేజ్మెంట్’లో మాస్టర్స్ (ఎం.బి.ఎ) చేసి, సినిమాలు చేస్తూనే సాహసాలు సైతం చేస్తుండే ఈ చిన్నదాని పేరు “అర్చనా సింగ్”. కన్నడ కాంతామణి అయిన అర్చనా సింగ్ ఇటీవల హిమాలయాల్లోని “ఎవరెస్ట్ బేస్ క్యాంప్”లో పాల్గొని తన తెగువను చాటి చెప్పింది. జీవితంలోనూ సమున్నత శిఖరాలు చేరుకోవడం తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది!!
ఎం.బి.ఎ. చేసిన అర్చనా సింగ్… సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే… “విప్రో, ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్’తోపాటు… కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్ లైన్స్”లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ అందలరాశి… తెలుగులో “దమయంతి – కౌశిక్ వర్మ” చిత్రంలో నటించి మెప్పించింది. “మై ఫాదర్ – మై హీరో” అనే చిత్రంతో మలయాళంలోనూ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రం ఇంగ్లీషులోనూ తెరకెక్కుతుండడం విశేషం.
ఆమె రీసెంట్ గానే తను చేపట్టిన “ఎవరెస్ట్ బేస్ క్యాంప్” గురించి ఈ “సాహస కన్య” మాట్లాడుతూ… “కెరీర్ బిగినింగ్ లో నేను చేసిన ఉద్యోగాలు, తర్వాత వరసగా దక్షిణాది భాషలన్నింట్లో నేను చేస్తున్న సినిమాలు ఇచ్చిన కిక్ కంటే… ఎవరెస్ట్ ఎక్కడం నాకు మరింత కిక్ ఇచ్చింది. జీవితంలో ఇంకా హైట్స్ కు చేరుకోవాలనే పట్టుదలను, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నాకు తెలియకుండానే నాలో ఏ మారుమూలో దాక్కుని ఉన్న బెరుకును, భయాన్ని ఈ సాహస యాత్ర పటాపంచలు చేసింది. ఈ అనుభవాన్ని, అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం” అని పేర్కొంది. నటన విషయానికి వస్తే… ఆల్రెడీ ఇతర భాషల్లో వర్క్ చేసిన ఈమె తెలుగులో మాత్రం ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది.


