
మన టాలీవుడ్ నుంచే ఈ మధ్య కాలంలో యువతని ఎంతగానో కదిలించిన సాలిడ్ లవ్ స్టోరీస్ లో కలర్ ఫోటో అలాగే బేబి లాంటి కల్ట్ సూపర్ హిట్స్ ని ఇచ్చిన మాస్ మూవీ మేకర్స్ మరో కల్ట్ సినిమాతో సిద్ధం అవుతున్నట్టుగా తెలిపారు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి సాలిడ్ అప్డేట్ అందించారు.
మరి ఈ చిత్రం తాలూకా టైటిల్ మరియు గ్లింప్స్ ని ఈ జూన్ 2న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఆరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి టైటిల్ సహా గ్లింప్స్ రివీల్ చేస్తారట. మరి నిర్మాత ఎస్ కె ఎన్ ఈ సినిమా పట్ల కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి కూడా సాయి రాజేష్ వర్క్ చేస్తుండగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. మరి ఈ చిత్రం నుంచి వచ్చే గ్లింప్స్ ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాల్సిందే.

