మనసులో మాట బయట పెట్టిన నయనతార !

మనసులో మాట బయట పెట్టిన నయనతార !

Published on Jun 9, 2025 12:03 PM IST

Nayanthara

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుని.. మొత్తానికి పెళ్లితో ఒకటి అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. కాగా, నేడు వీళ్ల మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా నయనతార పంచుకున్న ఫొటోలు ప్రస్తతం వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్నందుకు విఘ్నేశ్‌ కు నయన్ ధన్యవాదాలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది.

ఇంతకీ, నయనతార ఏం పోస్ట్ పెట్టారంటే.. ‘ఒకరిపైఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనేది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ నయనతార శుభాకాంక్షలు తెలిపింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు