ఇండియన్ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్ యానిమేషన్ చిత్రం “మహావతార్ నరసింహ” ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మొత్తంలో కూడా చాలా వరకు తెలుగు రాష్ట్రాల నుంచి వసూళ్లు కూడా బాగా ఎఫెక్ట్ చూపించాయి. ఇలా సినిమా విడుదల అయ్యిన నాటి నుంచి ఇప్పుడు వరకు భారీ మొత్తంలో ఈ చిన్న సినిమా అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.
తెలుగు స్టేట్స్ లో నిన్న మంగళవారం వరకు మహావతార్ నరసింహ చిత్రం ఏకంగా 12 కోట్ల షేర్ ని కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే అందుకుందట. అంటే గ్రాస్ మొత్తం ఈజీగా 20 కోట్లకి పైగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇలా యావరేజ్ గా చూసుకున్నా కూడా మహావతార్ నరసింహ చిత్రం రోజుకో కోటి షేర్ చొప్పున స్టడీగా వసూలు చేస్తుందని చెప్పవచ్చు. మరి ఇదంతా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

