ఎన్టీఆర్‌కు హృతిక్ రిటర్న్ గిఫ్ట్.. ఎంత ఎగురుతావో ఎగురు..!

ఎన్టీఆర్‌కు హృతిక్ రిటర్న్ గిఫ్ట్.. ఎంత ఎగురుతావో ఎగురు..!

Published on Aug 6, 2025 9:07 PM IST

JRNTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వార్-2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లోనూ ఇద్దరు హీరోలు తమ పాత్రలకు సంబంధించిన షేడ్స్ చూపిస్తున్నారు.

ఇటీవల హృతిక్ ఇంటిముందు ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తున్నట్లో ఓ బిల్‌బోర్డ్ దర్శనిమిచ్చింది. దానికి సంబంధించిన ఫోటోను హృతిక్ షేర్ చేశాడు. అయితే, తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటిముందు కబీర్ వార్నింగ్ ఇస్తున్నట్లు ఓ బిల్‌బోర్డ్ కనిపించింది. రిటర్న్ గిఫ్ట్ అదిరింది సార్.. అసలైన వార్ ఆగస్టు 14నే ఉంటుందని తారక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దీంతో అభిమానులు ఈ ఇద్దరు హీరోలు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం చేస్తున్న వార్ ఆకట్టుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడ్యూస్ చేయగా, ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు