లిటిల్ హార్ట్స్ : ఫ్రెండ్షిప్, లవ్, ఫన్ అన్నీ ఒకే చోట!

లిటిల్ హార్ట్స్ : ఫ్రెండ్షిప్, లవ్, ఫన్ అన్నీ ఒకే చోట!

Published on Aug 8, 2025 12:00 AM IST

RajaGadiki Song Launch Even

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫేమ్ శివాని నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ నిర్మాతగా, బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన “రాజా గాడికి” సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు తమ అనుభూతులు పంచుకున్నారు.

హీరో మౌళి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ. కాలేజ్ డేస్, ఫ్రెండ్షిప్స్, లవ్ స్టోరీ – అన్నీ సహజంగా, హాస్యంగా చూపించాం. శివానీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.

హీరోయిన్ శివానీ – “ఈ సినిమా కోసం ఏడాది పాటు మంచి పాత్ర కోసం వెయిట్ చేశాను. నా క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

డైరెక్టర్ సాయి మార్తండ్ – “మౌళి మీద నమ్మకంతో ఈ కథను మొదలుపెట్టాం. టీమ్ అంతా ఎంతో ప్యాషన్‌తో పనిచేసింది. ఈటీవీ విన్, నిర్మాతలకు థ్యాంక్స్” అన్నారు.

నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి – “లిటిల్ హార్ట్స్” చూస్తూ ప్రేక్షకులు నవ్వుతూ కుర్చీల్లోంచి కిందపడిపోతారు. కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, లవ్ – ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడండి, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ – “మా ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన సినిమా ఇది. పాటలు, బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు