ఈ వారం కూడా “మహావతార్ నరసింహ’ దే

ఈ వారం కూడా “మహావతార్ నరసింహ’ దే

Published on Aug 8, 2025 8:12 AM IST

mahavatar-narasimha

రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సెట్ చేసిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మహావతార్ నరసింహ అని చెప్పాలి. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ యానిమేటెడ్ చిత్రం భారీ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇలా విజయవంతంగా రెండు వారాల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఇదే సాలిడ్ రన్ తో మరో వారానికి వచ్చింది.

మొదటి రెండు వారాల్లో భారీ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ వాటిని మించి బలంగా నిలబడ్డ మహావతార్ నరసింహ ఈ వారంలో కూడా హవా చూపించనుంది అని చెప్పవచ్చు. ఈ వారంలో పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా నోటెడ్ సినిమాలు లేవు. సో ఈ వీకెండ్ లో కూడా మహావతార్ నరసింహదే అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు