‘స్టాలిన్’ రీ-రిలీజ్‌పై మెగాస్టార్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

‘స్టాలిన్’ రీ-రిలీజ్‌పై మెగాస్టార్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Published on Aug 16, 2025 10:05 PM IST

Stalin

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘స్టాలిన్’ చిత్రం ఓ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా చిత్రంలో మెగాస్టార్ స్టాలిన్ పాత్రలో సాలిడ్ అండ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో అలరించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు దశాబ్దాలు కావొస్తుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్ర రీ-రిలీజ్ డేట్‌ను వారు అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇక ఈ సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో మెగాస్టార్ చిరంజీవి కూడా హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన తన స్పందనను వీడియో రూపంలో తెలిపారు. ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న సినిమాలు ప్రస్తుతం కాలానికి చాలా అవసరం అని.. ఈ సినిమాను ఇప్పటి ఆడియన్స్ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని.. ఈ సినిమాలో నటించిన ఖుష్బూ, త్రిష, సాంకేతిక విభాగానికి తన అభినందనలు తెలిపాడు చిరు. ఈ సినిమా పై చిరు చేసిన వీడియోను మెగా ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు