సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ ఓ లెటర్ రాసింది. ఆ లెటర్ లో నాలుగు షరతులు, పర్సంటేజీ విధానాన్ని తెలియజేసింది. ఇంతకీ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన ఆ షరతులేమిటో చూద్దాం రండి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌ను 12 రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలనేది మొదటి షరతు. అలాగే, రెండో ఆదివారం, కార్మికశాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే విధంగా మరో షరతు పెటింది.
ఇక 2022 జులైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఫైటర్స్, డాన్సర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు అని, అది తప్పనిసరిగా అమలు చేయాలని మూడో షరతు పెట్టారు. ఇక నాలుగో షరతు విషయానికి వస్తే.. ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం.. నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తన సినిమా కోసం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ నాలుగో షరతు అమలులోకి వస్తే.. చిన్న సినిమాలకు చాలా మేలు జరగనుంది.


